అందుకే బిజెపికి అదరణ…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 10: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థ సుపరిపాలన అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనపై విశ్వాసంతోనే రోజురోజుకు బీజేపీ సభ్యత్వంపై ఆదరణ పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ సభ్యత్వం స్వీకరిస్తున్నారని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్లోని వైష్ణవి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ సమీక్షా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాలనతో పాటు సంస్థాగత వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారానే దేశవ్యాప్తంగా సర్వస్పర్శి, సర్వవ్యాపి సూత్రంపై బిజెపి విస్తరించిందన్నారు. అన్ని వర్గాలు, అన్ని మతాలకు చేరువైన బిజెపి 18 రాష్ట్రాల్లో, కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ తో పాలన సాగిస్తోందని తెలిపారు బూత్ స్థాయి నుండి కార్యకర్తల బలం అండదండలతో ప్రపంచములోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని, గతంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని అధిగమించిందన్నారు. బూతు స్థాయిలో పార్టీ పార్టీ అనుబంధ సంఘాలు బలోపేతం కావడం ద్వారానే కార్యకర్తల సైద్ధాంతిక పునాదులపై బీజేపీ ప్రభుత్వాలు జాతీయ భావన ఆధారంగా పాలన సాగిస్తున్నాయన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని మండలాల్లో, అన్ని పట్టణాల్లో పార్టీ సభ్యత్వాన్ని విస్తృతంగా నమోదయ్యేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని అన్నారు నూతన సభ్యత్వం ద్వారా బలమైన పార్టీ నిర్మాణం జరుగుతుందని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి మేయర్, చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే ఎంఐఎం పార్టీ, టిఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో మరోసారి ప్రశాంత వాతావరణం చెడగొట్టి అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్బరుద్దీన్ బహిరంగ సభ ఉద్దేశపూర్వకంగానే ఏర్పాటు చేశారని, ఆ క్రమంలోనే అక్బరుద్దీన్ ఓవైసీ ఫై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం వెనకడుగు వేసిందని విమర్శించారు. బాధ్యత కలిగిన పార్టీ కార్యకర్తలుగా కోర్టును ఆశ్రయించి ఓవైసీపై కేసు నమోదు చేయించామని, అందుకే ప్రజలు బిజెపి పార్టీ ని విశ్వసిస్తున్నారని సంజయ్ వివరించారు. పార్లమెంటు సమావేశాల్లో 370, 35ఏ ఆర్టికల్ లను రద్దుచేసి స్వయం ప్రతిపత్తిని తొలగించి జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం అమలయ్యేలా బిల్లు ఆమోదించడం ప్రతి సామాన్య పౌరుడు హర్షించారని తెలిపారు. పాకిస్తాన్, చైనా దేశాలు ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతాన్ని స్వాధీనపరచుకుంటామని లోక్ సభలో అమిత్ షా చేసిన ప్రకటన దేశ ప్రజలంతా స్వాగతించారని అన్నారు. గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలన్నీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ హితాన్ని, దేశ భద్రతను హక్కులను కాల రాశారని, అధికార రాజకీయాల కోసం కాకుండా భద్రత సంక్షేమం అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించినట్లు వివరించారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అమిత్ షా జేపీ నడ్డా నేతృత్వంలోని బిజెపి పార్టీ విజయాలను గడపగడపకు తీసుకెళ్ళు మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులను సంజయ్ కోరారు. బిజెపి జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన సభ్యత్వ సమీక్షా కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టె మురళీకృష్ణ, కొరటాల శివ రామయ్య, జిల్లా సభ్యత్వ ప్రముఖ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు టి హరి కుమార్ గౌడ్, మెరుగు పరశురాం, పార్టీ మండల అధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, కడార్ల రతన్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శులు బండ రమణారెడ్డి, నాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.