ఎంపీ సంజయ్ జన్మ దిన వేడుకలు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 11: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ 48వ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మంకమ్మతోట లోని శివ నరేష్ ఫంక్షన్ హాల్ లో సంజయ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు భారీ ఎత్తున హాజరు కాగా, సుమారు 180 మంది రక్తదానం చేశారు, ఈ రక్తదాన శిబిరాన్ని జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు ప్రారంభించారు. డాక్టర్ వంశీ, సౌమ్య లు పర్యవేక్షించారు. డాక్టర్ సౌమ్య, వంశీకృష్ణ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ పేద ప్రజలకు సహాయం చేయాలనే సంకల్పంతో ప్రమాదం గురై రక్తం అందక అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని, ఈ రక్తదాన శిబిరం వల్ల కొంతమందికైన సహాయం అవుతుందని, పేద ప్రజల ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని వారికి మెరుగైన వైద్య సదుపాయాలను అందించాలనే దృఢ సంకల్పంతో త్వరలో బండి సంజయ్ కుమార్ హెల్త్ ఫౌండేషన్ త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేేేేతలు శివరామయ్య, బేతి మహేందర్ రెడ్డి, మెండీ చంద్రశేఖర్, బండ రమణారెడ్డి, ముప్పిడి సునీల్, రాపర్తి ప్రసాద్ ,ఎన్నం ప్రకాష్, మెరుగు పరుశురాం, కటకం లోకేష్, కశెట్టి శేఖర్, పొన్నం మండన్న,కడర్ల రతన్, మామిడి రమేష్ , కచ్చు రవి,దురిశెట్టి సంపత్,దాసరి రమణ రెడ్డి ఎండి ముజీబ్,మాసం గణేష్, ఉప్పర పల్లి శ్రీనివాస్, ఈసపెళ్లి మహేష్ పర్వేజ్, సాయి,విజయ్ లో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగేే పలుచోట్ల సంజయ్ జన్మదిన వేడుకలు జరిగాయి.