JMS News Today

For Complete News

కొండగట్టు కు నడిచిన ఎంపీ బండి….

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 29: సనాతన ధర్మం ఆచరణలోనే ప్రజా పరిపాలన అంతరార్థం దాగి ఉందని, ధార్మిక భావన పాలనలోనే పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు లభిస్తాయని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్నారు. హనుమాన్ పరిక్రమ పాదయాత్ర స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం కరీంనగర్ నుంచి పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు కరీంనగర్లోని చైతన్యపురి లో గల మహాశక్తి దేవాలయం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో చారిత్రాత్మకమైన విజయాలను లక్షలాది మందికి అందించిన పుణ్యక్షేత్రమైన కొండగట్టు హనుమాన్ తో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉండి కృషి చేసేందుకు పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. గతంలో ఘాట్ రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది పేదలు మృతిచెందారని అలాంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన వివరించారు. ప్రతియేటా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పండగల సందర్భాల్లో లక్షలాదిమంది భక్తులు సందర్శించే కొండగట్టు ప్రాంత అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా జత చేస్తామని తెలిపారు. తనలాంటి సామాన్య కార్యకర్తలు వందలాది మంది కొండగట్టు హనుమంతుడిపై విశ్వాసముంచి తన గెలుపుకు కృషిచేసి కార్యకర్తలందరూ విజయం సాధించారని, కార్యకర్తలందరూ సామూహిక నిర్ణయంతో పాదయాత్ర చేపట్టాలని సంకల్పాన్ని వ్యక్తం చేయడంతో కార్యకర్తలతో సమిష్టిగా పాదయాత్ర చేపట్టినట్లు సంజయ్ వివరించారు. పుణ్యక్షేత్రమైన కొండగట్టు ప్రాంత అభివృద్ధి కోసం దేవాలయ ప్రాంగణంలో విస్తృతమైన సౌకర్యాలను ఏర్పరిచేందుకు ప్రజలందరూ అందరూ కొండగట్టు అభివృద్ధి లో భాగస్వామ్యం అయ్యేందుకు దేవస్థానం కమిటీ అనుసంధానంతో ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా దేవాలయ అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి కొండగట్టు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తామని, అందుకు త్వరలోనే దేవాలయ అధికారులు జగిత్యాల జిల్లా అధికారులతో కలిపి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ బండి సంజయ్ తెలిపారు. బండి చేపట్టిన హనుమాన్ పరిక్రమ పాదయాత్రను బిజెపి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు బాషా సత్యనారాయణ రావు, ప్రతాప రామకృష్ణ లు ప్రారంభించారు. పాదయాత్ర మార్గంలో రేకుర్తి కొత్తపెళ్లి లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, హిందూ స్వాభిమాన్ వేదిక కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రామడుగు మండలం వెదిర వద్ద చొప్పదండి మాజీ శాసన సభ్యురాలు బొడిగ శోభ స్వాగతం పలికి కొండగట్టు వరకు ఎంపీ సంజయ్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. రామడుగు, గంగాధర మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి గ్రామం వద్ద పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గంగాధర మండలం పరిసరాలలో బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు బాజోజీ భాస్కర్ జిల్లా పార్టీ శ్రేణులతో ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్రలో కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్ వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, బాస సత్యనారాయణరావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టె మురళీకృష్ణ, శివరామయ్య, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి, బోయినపల్లి ప్రవీణ్ రావు,బాజోజి భాస్కర్ ,శ్రీనివాస్ రెడ్డి సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపి,సొల్లు అజయ్ వర్మ, మల్లికార్జున్, సురేందర్రావు, నాగ మహేష్ మండల అధ్యక్షులు కోలా అశోక్ గంగాధర్ రవీందర్రెడ్డి జిల్లా కార్యదర్శి వేణు మేకల ప్రభాకర్ యాదవ్ రామకృష్ణ శ్రావణ్,గాజుల స్వప్న, బండ అనిత,సుజాత రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *