అంతా పారదర్శకంగానే….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 7: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పై కసరత్తు కొనసాగుతుందని కమీషనర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ ఓటర్ల గణనలో బాగంగా గత వారం రోజుల క్రితం డివిజన్ ల పునర్విభజన ప్రక్రియలో 50 వార్డులను విలీన గ్రామాలతో కలిపి 60 డివిజన్లగా ఏర్పాటు చేస్తూ, మొదటి ప్రకటన వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో విభజించిన వార్డుల ఓటర్ల గల్లంతు, హద్దుల గల్లంతు పై గత పాలక వర్గం సభ్యులు, ఇతరుల నుండి అభ్యంత్రాలు రావడం జరిగిందని, నగర వ్యాప్తంగా మొత్తం 109 అభ్యంత్రాలను స్వీకరించడం జరిగిందని, స్వీకరించిన అభ్యంత్రాలను పూర్తి స్థాయిలో ఫీల్డ్ ఇన్ స్పెక్షన్ చేయడం జరిగిందని వివరించారు. నగర చిత్ర పటం, ఓటర్ లిస్టు ఆధారంగా న్యాయబద్దంగా ఉన్న అభ్యంత్రాల పై ప్రభుత్వ నియమ నిబందనల ప్రకారం పూర్తి స్థాయిలో 5 రోజుల పాటు కసరత్తు చేశామని, హద్దుల మార్పు చేర్పులు, గల్లంతైన ఓటర్ల ను కలుపుకొని వార్డుల ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశామని, వచ్చిన 109 అభ్యంత్రాల్లో 76 అభ్యంత్రాల సమస్యలును పరిష్కరించి, 33 అభ్యంత్రాలను రిజక్ట్ చేయడం జరిగిందని, తయారు చేసిన ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించడం జరిగింందని పేర్కొన్నారు. ప్రభుత్వం గెజిట్ ఆధారంగా వార్డుల పునర్విభజన ప్రకటనను సోమవారం అధికారికంగా విడుదల చేస్తుందని కమీషనర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.