సాదాసీదాగా చివరి భేటీ…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 2: కరీంనగర్ నగరపాలక సంస్థలో మంగళవారం నిర్వహించిన చిట్ట చివరి సాదారణ సర్వ సభ్య సమావేశం, పాలక వర్గం వీడ్కోలు సమావేశం సాదాసీదాగా కొనసాగింది. నగర మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ అద్యక్షతన కమీషనర్ వేణుగోపాల్ రెడ్డి ఆద్వర్యంలో డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లు, కో- ఆప్షన్ మెంబర్ల సమక్షంలో సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఈ సర్వసభ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు సుదీర్ఘంగా సాగింది. సర్వసభ్య సమావేశంలో 4 ఎజెండా అంశాలను చేర్చడం జరిగింది. ఇందులో ప్రధానంగా రెండు ఎజెండా అంశాల పై చర్చ కొనసాగింది. మొదటి అంశం విలీన గ్రామాలు, పెండింగ్ వేతనాలు చెల్లించుట, నగరపాలక సంస్థలో విలీనమైన ఉద్యోగులకు నగరపాలక సంస్థ ప్రస్తుతం ఉన్న వేతనాలను చెల్లించుటపై చర్చ జరిగింది. విలీన గ్రామాల కార్మికులకు పెండిగ్ వేతనాలు చెల్లించి నగరపాలక సంస్థ మాదిరిగా జివో నెం 14 ఫైనాన్స్ ప్రకారం 12 వేల చొప్పున నూతన వేతనాలను ఇచ్చేందుకు సభ్యులు తీర్మాణం చేశారు. అనంతరం జిరో అవర్ సమయంలో ఐదేళ్ళ పాలక వర్గంలో జరిగిన అభివృద్ధి పనులు, వచ్చిన నిధులు, ప్రస్తుతం డివిజన్ లో ఉన్న సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ అభివృద్ధి పనులు లతో పాటు పాలక వర్గం పదవి కాలంలో ఎదురైన సమస్యలు, కష్టనష్టాలు,సాదక బాదకాలను నెమరు వేసుకున్నారు. నిన్న రాత్రి 60 వార్డులుగా విభజిస్తూ విడుదలైన ప్రకటనపై పాలక వర్గ సభ్యులు సమావేశంలో చర్చించారు. పలువురు కార్పోరేటర్లు వార్డుల విభజనలో ఒటర్ల గల్లంతు, వాడల గల్లంతు లాంటి అంశాల పై సభా అధ్యక్షుల సమక్షంలో విన్నవించారు. విభజనకు సంబందించి కమీషనర్ వేణుగోపార్ రెడ్డిని సమావేశంలో వివరణ కోరారు. దీంతో కమీషనర్ ఓటర్ల గణన విషయంలో ఎలాంటి తప్పులు జరగలేదని…జనాభ ఓటర్ల ప్రకారం వార్డులను విభజించామని వివరించారు. ఏమైనా పొరపాటు జరిగిందని మీకు సందేహం అనిపిస్తే తమకు దరఖాస్తు అందించాలని కోరారు. ఇచ్చిన దరఖాస్తు ప్రకారం ఫీల్డ్ విజిట్ చేసి సాధ్యమైతే వాటిని పరిష్కరిస్తామన్నారు. అంతే కాకుండా ఈ సమావేశంలో నగరంలో అభివృద్ధి పనులు మరియు పెండింగ్ అభివృద్ధి పనుల పై చర్చించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని కమీషనర్ ను కోరారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ గత పాలక వర్గ పాలనకంటే తెలంగాణ ఏర్పాటు తర్వత వచ్చిన పాలక వర్గంలోనే కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందని తెలిపారు. మా పాలకవర్గంలో కరీంనగర్ స్మార్ట్ సిటీ జాబితాలో చేరడం మాకు ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో స్మార్ట్ సిటీలో కరీంనగర్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఏ ప్రభుత్వం ఇవ్వని నిధులు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ కరీంనగర్ నిధులు ఇచ్చి అభివృద్ధికి బాట వేసారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు సభా ముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఈటెల రాజేంధర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ రవీంధర్ సింగ్ ల కృషితో నగరం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. దేశం మొత్తం కరీంనగర్ వైపు చూసే విధంగా మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ గారు పేద ప్రజల కోసం 1 నల్ల, అత్యక్రియలు,రక్త పరిక్షలు, సరస్వతి ప్రసాదం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను పెట్టి నగరపాలక సంస్థకు ఎంతో పేరు తెచ్చారని, ఆ గౌరవం పాలక వర్గ సభ్యులుగా మాకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నిధులతో నగరాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని సర్వసభ్య సమావేశంలో తీర్మాణం ప్రవేశ పెట్టారు. దాదాపు 5 గంటల పాటు సాగిన సర్వసభ్య సమావేశంలో చివరిగా జాతీయ గీతాన్ని ఆలపిస్తు సభను ముగించారు. అనంతరం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి పాలక వర్గ సభ్యులకు మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిల్ల రమేష్, కమీషనర్ వేణుగోపాల్ రెడ్డిలు సన్మానం చేశారు. కార్పోరేటర్లకు శాలువా కప్పి…జ్ఞాపికను అందించి గౌరవంగ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిష్నల్ కమీషనర్ రాజేంధర్ కుమార్, డిప్యూటీ కమీషనర్ స్వరూపరాణి, ఎఈ భద్రయ్య, డీఈలు యాదగిరి, మసూద్, రామన్, ఏసీపీ వందనం, ఆర్వో రాములు, ఏఈలు చైతన్య, వెంకట్ కుమార్, మోహాన్ రెడ్డి, ఆసిఫ్ మరియు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.