ఆగస్టు లో పుర పోరు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్, జూలై 5: వచ్చే నెల లో పుర పోరు జరగనుంది. ఆగస్టు 11న మున్సిపాలిటీ ఎన్నికలు జరుగనున్నట్టు సమాచారం. ఎన్నికల కు సంబంధించి జులై 21న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి చక చక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12న వార్డుల వారీగా ఓటర్లు జాబితా
ముసాయిదా ప్రకటన, అనంతరం వార్డులు వారీగా sc, st, బీసీ, మహిళలు ఓటర్లు ను
గుర్తించి, 19న అధికారికంగా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. మొత్తానికి వచ్చే నెెలలో పుర పోరు జరిగే అవకాశాలు ఉన్నాయి.