హమ్మయ్యా..పుర పోరుకు పచ్చ జెండా
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 22: హమ్మయ్యా..పుర పోరుకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. దీంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ చట్టబద్ధంగా జరగడం లేదని వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ఆగస్టు 15లోపే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, తెలంగాణలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మరోవైపు, నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని కూడా పిటిషనర్లు తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా ఏకపక్షంగా ప్రక్రియను పూర్తి చేశారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మున్సిపాలిటీల్లో ఎన్నికలపై స్టే విధించింది. దాఖలైన పిటిషన్లంటిపై విచారించి, వాటిని కొట్టి వేస్తూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఇవాళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠ రేపుతున్న పుర పోరు కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. అయితే, రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళుతుంందా లేదా అన్నది వేసిచూడాల్సిందే.