మున్సిపల్ ఎన్నికల విచారణ 29కి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 22: ఈ నెల 29 వరకు మున్సిపల్ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని, తదుపరి విచారణను 29వ తేదికి హైకోర్టు వాయిదా వేసింది. మున్సిపల్ ఎన్నికలకు హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్నారన్న పిటిషన్పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రిజర్వేషన్లు, చట్టాన్ని ఎలా అమలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించగా, సమాధానం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును గడువు కోరింది. ఎన్నికల కోసం109 రోజులు కావాలని ప్రభుత్వం సింగిల్ జడ్జి నుంచి అనుమతి తీసుకుందని, ఇప్పుడు హడావుడిగా నిబంధనలను పట్టించుకోకుండా ఏర్పాట్లు చేస్తోందన్న పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అత్యవసరంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏంటని, చట్టాన్ని ఎలా అమలు చేస్తారని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. దీనిపై సమాధానానికి సమయం కోరగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.