మళ్లీ వాయిదా….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, ఆగస్టు 28: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారణను సెప్టెంబర్ 9వ తేదికి హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కాగా, పిటిషనర్లు దాఖలు చేసిన రీప్లై కౌంటర్ కు ప్రభుత్వం సమయం కోరడంతో హైకోర్టు సమయమిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 9 కి వాయిదా వేసింది.