మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జనవరి 6: మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది. తెలంగాణలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే నోటిఫికేషన్ విడుదల చేయాలనుకోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. నిబంధనలు పాటించకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాలని చూస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఎన్నికల నియమావళిని న్యాయస్థానానికి సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయొద్దని ఆదేశించింది. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా, ఎన్నికల కమిషన్ ప్రకారం రేపు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.