JMS News Today

For Complete News

మున్సిపల్ సిబ్బంది వినూత్న ప్రచారం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 3: కరీంనగర్ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో పారిశుధ్య సిబ్బంది వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నెల నుండి తడి చెత్త, పొడి చెత్త వేరు పై నగరపాలక కమీషనర్ జీ.వేణుగోపాల్ రెడ్డి ఆదేశాల ప్రకారం డివిజన్లలో పారిశుధ్యం పై అవగాహాన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రతి డివిజన్ ఏరియాల వారిగా ఇన్ స్పెక్టర్లు, జవానులు, పారిశుధ్య కార్మికులు అవగాహాన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో 24వ డివిజన్ లో సానిటేషన్ ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో చెత్త బుట్టలతో ర్యాలీ నిర్వహించారు. డివిజన్ లో గల్లీ గల్లీకి, గడప గడపకు మహిళ కార్మికులు వెల్లి ఇంటి మహిళకు బొట్టు పెట్టి వినూత్నంగా అవగాహాన కల్పించారు. చెత్త బుట్టల రంగులను మహిళలకు గుర్తు చేస్తూ, తడి చెత్త, పొడి చెత్త ను వేరు చేసి రిక్షా కార్మికులకు అందించాలని కోరారు . అంతేకాకుండా డివిజన్ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, వాటి వల్ల వచ్చే వ్యాధుల పై కూడ మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ స్పెక్టర్ మహేందర్, జవాన్ త్యాగరాజు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *