JMS News Today

For Complete News

కరీం”నగరం”లో 14 ఏర్పాటు చేస్తాం..!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, సెప్టెంబర్ 23: కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా త్వరలో 14 నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు కమీషనర్ వల్లూరు క్రాంతి వెల్లడించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నర్సరీల ద్వారా మొక్కల పెంపకం, హరితహారంపై కమీషనర్ క్రాంతి చర్చించారు. నర్సరీ ఏర్పాటుపై పలు సలహాలు సూచనలు చేసి, ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా కమీషనర్ క్రాంతి మాట్లాడుతూ నగరంలో నర్సరీలలో మొక్కలు పెంచేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశగా 5 నర్సరీల పనులు వెంటనే ప్రారంభించాలని, వాటికి కావల్సిన ప్లాస్టిక్ కవర్లు, ఎర్రమట్టి, సేంద్రియ ఎరువులను సిద్దం చేసుకోవాలని తెలిపారు. నగరపాలక సంస్థకు చెందిన కోతిరాంపూర్, రాంనగర్, అంభేడ్కర్ నగర్, కోర్టు, ఎస్ ఆర్ ఆర్ మంచి నీటి రిజర్వాయర్లలో నర్సరీల కోసం స్థలాలను గుర్తించాలన్నారు. సంబందిత ఏరియాల ఏఈలు స్థల పరిశీలన చేసి నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతే కాకుండ ఎల్ ఎం డీ రెండున్నర ఎకరాల స్థలంతో పాటు నగరంలోని బుల్ సెమన్ సెంటర్, ఎస్ ఆర్ ఆర్ కళాశాల, స్పోర్ట్ స్కూల్, వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాల, శాతవాహాన యూనివర్సిటీ, పద్మానగర్ ఎస్ ఆర్ ఎస్పీ ల్యాండ్, మానేరు డ్యాం సీఎం పాయింట్ ప్రదేశాలను కూడ నర్సరీల కోసం ఎంపిక చేయాలని ఆదేశించారు. సంబందిత ప్రదేశాలను సందర్శించి నర్సరీకి సరిపడ స్థలాన్ని గుర్తించాలని అన్నారు. ప్రతి నర్సరీలో దాదాపు 10 వేల పైచిలుకు మొక్కలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి నర్సరీకి రక్షణగా పెన్సింగ్, నీటి వసతి, ఉండే విధంగా చూడాలని కోరారు. అంతే కాకుండ మొప్మా సంస్థ ఆద్వర్యంలో మహిళ సంఘం సబ్యుల ద్వారా ఏర్పాటు చేస్తున్న 18 నర్సరీలకు కూడ ప్లాస్టిక్ కవర్లు, ఎర్రమట్టిని సిద్దం చేసేందుకు చర్యలు తీసుకొని వారి అందించాలని కోరారు. మొదటి దశ కింద ఏర్పాటు చేసే 5 నర్సరీలలో వెంటనే మొక్కల పెంపకం పనులు ప్రారంబించి, వారం రోజుల్లో విత్తనాలను నాటాలని కోరారు. మిగితా నర్సరీలకు అన్ని ఏర్పాట్లను సిద్దం చేసి, వాటి పనులు కూడ ప్రారంబించే విధంగా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణకు హారితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలో నాటిన యాదాద్రి మియావాకీ ట్రీ పార్కులలో పట్టణ ప్రకృతి వనాల పేరిట బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా నర్సరీలు ఏర్పాటు చేసే చోట కూడ బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. నగరంలో ఎవెన్యూ ప్లాంటేషన్ కు సంబందించిన ఏఈల వారిగా నాటిన మొక్కల వివరాల రికార్డులను రెండు రోజుల్లో అందించాలన్నారు. ఎవెన్యూ ప్లాటేంషన్ మొక్కలకు సాసరింగ్ చేసి నీటి తడులు అందించాలని కోరారు. డివిజన్ల వారిగా ఇంటింటికి పంపిణీ చేసిన మొక్కల వివరాల రికార్డులను త్వరగా అందించాలన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ అయిన వివరాలను ఇంటి నెంబర్ల వారిగా అందించాలని కోరారు. మొక్కలు పంపిణీ చేయని పెండింగ్ డివిజన్లలో మొక్కల పంపిణీ కార్యక్రమాలు ప్రారంబించి వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. నగర వ్యాప్తంగా నాటిన మొక్కలను ఇచ్చిన మోబైల్ ఆప్ సైట్ ద్వారా క్యాప్చర్ చేయాలని క్రాంతి తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఈ కృష్ణారావు, ఈఈ రామన్, డీఈ వెంకటేశ్వర్లు, ఓంప్రకాష్, హారితహారం ఇంచార్జ్ నరేంధర్, ఏఈ లు వాణి, వెంకట్ కుమార్, మోహన్ రెడ్డి, గంగాధర్, చైతన్య, గట్టు స్వామి, పరమాచారి, గఫూర్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *