JMS News Today

For Complete News

తప్పకుండా ఇస్తాం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మార్చి 17: కరీంనగర్ జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. గురువారం టీయూడబ్ల్యూజే- ఐజెయూ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నివేశన స్థలాల సమస్య తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్ ను ఆదేశిస్తామని వెల్లడించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలు తీరుస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ కు టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, జానంపేట మారుతి స్వామి, కోశాధికారి తాండ్ర శరత్ రావు , ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ మహేంద్ర చారి, ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొయ్యడ చంద్రశేఖర్, ఉరేడి రవీందర్, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, కోశాధికారి గుండేటి సతీష్, వీడియో జర్నలిస్ట్ అధ్యక్ష కార్యదర్శులు డి సంపత్, బి ప్రేమ సాగర్, ఎండి షూకూర్ సుదీర్, మహిధర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *