మంత్రి గంగులకు ఊరట…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో మంత్రి గంగుల కమలాకర్ కు ఊరట లభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, నేటి మంత్రి గంగుల కమాలాకర్ పై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్ని శుక్రవారం నాంపెల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ1గా మంత్రి గంగులతో పాటు వరుసగా నాయకులు చల్లా హరిశంకర్, చంద్రశేఖర్, సూర్యశేఖర్, బ్టటు వరప్రసాద్, పెద్ది రమేష్ లపై కేసు నమోదు అయిన విషయం విధితమే. ఈ కేసులో నమోదైన అభియోగాలపై నాంపెల్లి ఎంఎల్ఏ, ఎంపీల (ప్రజాప్రతినిధులు) కోర్టు విచారించగా, గంగుల తరుపున అడ్వకేట్ రాజేందర్ రావు వాదనలు వినిపించారు. అయితే ప్రాసిక్యూషన్ అభియోగాలను నిరూపించలేకపోవడంతో మంత్రి గంగులతో సహా మిగతా వారందరిపై కేసులను కొట్టివేసి నిర్దోషులుగా కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు పట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతోషం వ్యక్తం చేశారు.