ఎన్ కౌంటర్ పోలీసులకు నోటీసులు…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
డిల్లీ, డిసెంబర్ 6: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం, హత్య కేసులో నిందితులు ఇవాళ పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. అయితే, ఈ ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) దర్యాప్తునకు ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎన్కౌంటర్లో నిజానిజాలు తెలుసుకునేందుకు వెంటనే ఒక బృందాన్ని ఘటనా స్థలానికి పంపాలని ఎన్హెచ్ఆర్సీ డీజీ(దర్యాప్తు)ని ఆదేశించింది. ఘటనాస్థలాన్ని పరిశీలించి వెంటనే నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ఎస్ఎస్పీ నేతృత్వంలోని దర్యాప్తు బృందం మరికాసేపట్లో హైదరాబాద్ బయల్దేరనున్నట్లు తెలుస్తోంది. కాగా, పోలీసుల చర్యలపై మాత్రం ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.