యువత ఆ కార్యక్రమాలు చేపట్టాలి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 12: భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తిని క్రోడీకరించి బలోపేతం చేయడానికి నెహ్రు యువ కేంద్రాల స్థాపన జరిగినదని నెహ్రు యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ ఎన్.ఎస్.మనోరంజన్ అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సోమవారం నెహ్రు యువకేంద్ర వరంగల్, కరీంనగర్ జిల్లాల యూత్ కో ఆర్డినేటర్ మనోరంజన్ డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతిపై వెళుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీతలు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సన్మానించారు. ఈ సందర్బంగా మనోరంజన్ మాాట్లాడుతూ సామాజిక స్వచ్ఛంద కార్యక్రమాలు యువత చేపట్టాలని, తద్వారా గ్రామాల అభివృద్ధిలో యువజన సంఘాల పాత్ర చాలా కీలకమని, కాబట్టి యువజన సంఘాలు స్వచ్ఛందగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని అన్నారు. స్వచ్ఛభారత్, మొక్కల పెంపకం, అక్షరాస్యత వంటి కార్యక్రమలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నెహ్రు యువకేంద్ర అకౌంటెంట్ బి.రవిందర్, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్, ఆవుదరి కిరణ్ కుమార్, అలువాల విష్ణు తదితరుల పాల్గొన్నారు .