కరీంనగర్ కొత్త కలెక్టర్ గా శశాంక..
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, డిసెంబర్ 16: కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. కొత్త కలెక్టర్ గా శశాంక నియమితులయ్యారు. కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ ను ఎక్సైజ్ కమీషనర్ గా నియమిస్తూ, ఆయన స్థానంలో గద్వాల జిల్లా కలెక్టర్ గా ఉన్న శశాంక ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మంత్రి గంగులతో ఉన్న విభేదాలే బదిలీకి కారణమని ప్రచారం జరుగుతుండగా, మూడేళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా పాలనపరంగానే బదిలీ జరిగినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.