కొలువులో కి కొత్తోళ్లు….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 4: ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో మండల పరిషత్ నూతన కార్యవర్గాలు గురువారం కొలువుదీరాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో ఆయా నియోజకవర్గాల మండల ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఈరోజు నుంచి కొత్త ప్రజా ప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే లు హాజరయ్యారు. కొత్త వారు కొలువుదీరడంతో మండల పరిషత్తు లలో సందడి నెలకొంది. కాగా, శుక్రవారం జడ్పీ ఛైర్మన్లు, జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.