కొత్తగా మరో రెండు ఏర్పాటు…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 18: తెలంగాణలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో కొత్తగా కోరుట్ల.. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలతో కోరుట్ల డివిజన్.. కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాలతో.. కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.