JMS News Today

For Complete News

అక్కడి పోలీసుల అదుపులో ఇక్కడి ప్రముఖ వ్యాపారవేత్త…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

సెర్బియా, జూలై 30: వాన్‌పిక్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ఫిర్యాదు చేయడంతో బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సెర్బియాలో విహారయాత్రకు వెళ్లగా అక్కడే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే, నిమ్మగడ్డను భారత్‌కు తీసుకువచ్చేందుకు వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు సెర్బియాతో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశం కాగా, నిమ్మగడ్డకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ ప్రసాద్‌ను రెండు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *