JMS News Today

For Complete News

బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 6: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. శనివారం నగరంలోని ప్రభుత్వ అ బాలికల జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే  ప్రారంభించారు. ఈ సందర్భంగా 1,300 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా  కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్ విద్యను వేదం చేయాలనే లక్ష్యంతో నాణ్యమైన విద్యను, ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ చాలా మందిని ఉత్తమ విద్యార్థులగా తీర్చి దిద్దుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో నైపుణ్యం ఉన్నా అధ్యాపకులు ఉన్నారని , మంచి నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోని అందుతుందని అన్నారు. ఎంతోమంది మేధావులు, రాజకీయ నాయకులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారని, వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల కళాశాలలో విద్యను అభ్యసించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అధైర్యపడవద్దని, ప్రభుత్వ అ పాఠశాలలో చదువుతున్న మని గర్వంగా చెప్పు కోవాలని అన్నారు. నిరుపేద విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. విద్యార్థులు ఇంటర్నెట్ ను మంచి కోసం వినియోగించుకోవాలని, చెడును విస్మరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి , అధ్యాపక బృందం తో పాటు నాయకులు వై.సునీల్ రావు, చల్లా హరి శంకర్, ఏ.వి రమణ, దుడ్డేల శ్రీధర్, సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *