పట్టుదల పెట్టుబడి అయితే….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 1: ధైర్యం ఒక ఆయుధం, దీనికి తోడు పట్టుదల, కసి, కృషి ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డి విద్యార్థినులకు సూచించారు. ప్రతి సెకన్ కూడా చాలా విలువైనదని, దానిని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలని, సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. గురువారం కరీంనగర్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన షీ బృందాల తీరుపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పట్టుదల పెట్టుబడి కావాలి, అప్పుడే విజయం నీ గడప తడుతుంది అని వివరించారు. ఏ విషయంలో నైన ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, తల్లితండ్రులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఆమె సక్సెస్ స్టోరీ ని వివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీ కమలాసన్ రెడ్డి, అడిషనల్ డిసిపి శ్రీనివాస్, ఎసిపి ఉషారాణి, సీఐ దామోదర్ రెడ్డి, షీ బృందాల ఎఎస్ఐ విజయమణి తదితరులు పాల్గొన్నారు.