JMS News Today

For Complete News

బొగ్గు పై ఒప్పందం…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూన్ 28:  2019-20 ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి నుండి 80 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు చేయడానికి నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్.టి.పి.సి.) సంస్థ సింగరేణితో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ మేరకు శుక్రవారం హైద్రాబాద్ సింగరేణి భవన్లో జరిగిన సమావేశంలో ఎన్.టి.పి.సి నుండి చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.డి.ప్రసాద్, సింగరేణి నుండి మార్కెటింగ్ జి.ఎం. ఆంటోనిరాజాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింగరేణి సంస్థ 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఎన్.టి.పి.సి.కి 80 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేస్తుంది. ఈ బొగ్గును తెలంగాణాతో పాటు, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, హర్యానా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలలో గల ఎన్.టి.పి.సి. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రవాణా చేయనున్నారు. సింగరేణిలోని సత్తుపల్లి, మణుగూరు, మందమర్రి, రామగుండం తదితర గనుల నుండి ఉత్పత్తి అయ్యే వివిధ రకాల గ్రేడ్ ల బొగ్గును సింగరేణి సరఫరా చేయనుంది. ఈ సందర్భంగా ఇరు సంస్థల అధికారులు రోజుకు ఎన్ని ర్యేకుల బొగ్గు ఏఏ ఏరియాల నుండి సరఫరా చేయాలి అనే విషయంపై కూలంకషంగా చర్చించారు. నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు సింగరేణి తీసుకొంటున్న ప్రత్యేక చర్యలపై జిఎం              అంటోని రాజా వివరించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ  జీఎం ప్రసాద్ సింగరేణి నుండి ఎన్.టి.పి.సి. సంస్థ గత కొన్ని దశాబ్దాలుగా బొగ్గును కొనుగోలు చేస్తోందని, బొగ్గును ఒప్పందం ప్రకారం సకాలంలో అందిస్తూ తమ విద్యుత్ ఉత్పాదనకు ఎంతో సహకరిస్తోందనీ, కోల్ ఇండియాతో పోలిస్తే సింగరేణి మెరుగైన రీతిలో బొగ్గు సరఫరా చేస్తోందని సింగరేణిని ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా ఎన్.టి.పి.సి. నిర్వహిస్తున్న ప్రస్తుత మరియు నూతన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గును విరివిగా వాడుతున్నామని సింగరేణి సంస్థ కూడా ఈ విషయంలో తమకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపాారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జి.ఎం. (ఫైనాన్స్&అకౌంట్స్) నర్సింహమూర్తి, ఎ.జి.ఎం. (మార్కెటింగ్) ఎన్.వి.కె.శ్రీనివాస్, ఎన్.టి.పి.సి. నుండి ఎజిఎం అజయ్ సింఘాల్, ఏజిఎం. (హైద్రాబాద్) రాజీవ్ నందన్, సీనియర్ మేనేజర్ జి.సుందర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *