దారుణం…దంపతుల హత్య
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 9: కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. మాజీ ఎంపిటిసి దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వీణవంక మండలం కొండపాక లో మంగళవారం చోటుచేసుకుంది. పూరేళ్ళ సుశీల, పోశాలు అనే వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. భూ తగాదాలే దంపతుల హత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.