వృద్ధురాలిని రక్షించిన లేక్ పోలీసులు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 5: చనిపోవాలని డ్యాం వద్ద కు వచ్చిన ఓ వృద్ధురాలిని లేక్ పోలీసులు గమనించి రక్షించారు. అనంతరం ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాశ్మీరగడ్డకు చెందిన ఇరుకుల్ల రాజవ్వ (75) అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉండగా, తలా నెల రోజుల చొప్పున ఉంటుంది ఈ నెల చిన్న కొడుకు వంతురాగా, చిన్న కుమారుని ఇంటి వద్ద ఇబ్బందికరంగా ఉండడం వల్ల మనస్తాపం చెంది ఆమె శుక్రవారం సాయంత్రం డ్యామ్ లో పడి చనిపోవడానికి రాగా, పెట్రోలింగ్ చేస్తున్న లేక్ పోలీసు ఆర్ఎస్ఐ శ్రీశైలం, సిబ్బంది నర్సింహారెడ్డి, మారుతీ, మునీంధర్ లు గమనించి పట్టుకోగా, వన్ టౌన్ సిఐ తులా శ్రీనివాసరావు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె కుమారులకు అప్పగించారు.