JMS News Today

For Complete News

మరో మరణం….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, మార్చి 30: కరోనా వైరస్ మరోకరిని కాటేసింది. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 6 కరోనా కేసులు నమోదు కాగా, ఓ మరణం చోటుచేసుకుంది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరింది. మూడ్రోజుల కిందట తొలి కరోనా మరణం సంభవించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77కు చేరుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కరోనా పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందిన 13 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని బులెటిన్ లో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *