JMS News Today

For Complete News

ఒకరోజు సమ్మెలో పోస్టల్ ఉద్యోగులు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 10: తపాల శాఖను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు బుధవారం కరీంనగర్ ప్రధాన తపాల శాఖ ఎదుట సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెన్షనర్ల సంఘం, చిన్న మొత్తాల సంఘాల నాయకులు ఈ సమ్మెలో పాల్గొని మద్ధతు తెలిపారు. ఈ సమ్మెలో పాల్గొన్న వివిధ విభాగాల యానియన్ నాయకులు సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలతో అనుబంధం ఉన్న పోస్టల్ శాఖను ప్రైవేటీకరణను నిలిపివేయాలని, పోస్టల్ ఖాతాలను పేమెంట్ బ్యాంక్ కు బదిలీ చేయకూడదని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైల్వే మెయిల్ సర్వీసెస్ నీ యధావిధిగా కొనసాగించాలని, పోస్టల్ ఇన్సూరెన్సుని పోస్టల్ శాఖలోనే కొనసాగించాలని, జీడీఎస్ ఉద్యగులను రెగులరైజ్ చేయాలని, ఖాలీగా ఉన్న పోస్టులను భర్తి చేయాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు డీఆర్, డీఎను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులు కోవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన పారితోషికం వెంటనే విడుదల చేయాలని, కారుణ్య నియామకాలు వంద శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘం కార్యదర్శులు ఎ.రామచంద్రo, అనిల్, సుధాకర్ ల అధ్యక్షతన జరిగిన ఈ సమ్మెలో పోస్టు మాస్టర్ ఫజుల్ రహమాన్,  నాయకులు ఎ.రమేష్, డి.మల్లేశం, పవన్ కుమార్, రాజ్ కుమార్, సతీష్, మహేష్ కన్నయ్య, స్వామి, చక్రపాణి, దిలీప్, రాజు, క్రిష్ణకాంత్, అభిషేక్, మనోహర్, అనుష, సదయ్య, గంగయ్య, వీణ శ్రీ, శ్రీకాంత్, శివ, సతీష్, వేణు, ఎల్లయ్య, చిన్న మొత్తాల పొదుపు సంఘం ప్రతినిధులు రామేశం, క్రిష్ణకిషోర్, సీఐటీయు ప్రతినిధులు ఎడ్ల రమేష్, ముకుందరెడ్డి, పెన్షనర్ల సంఘం నాయకుడు లక్ష్మీపతిలతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.