రైతు ప్రాణం తీసిన యూరియా కొరత…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
దుబ్బాక, సెప్టెంబర్ 5: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎదుట క్యూ కడుతున్నారు. యూరియా కొరత నివారించాలంటూ రైతులు పలు ప్రాంతాల్లో ఆందోళనలు కూడా చేస్తున్నారు. అయితే, యూరియా కోసం గత రెండు రోజులుగా క్యూ లో నిల్చున్న ఓ రైతు అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన చెర్వాపురం ఎల్లయ్య (65) అనే రైతు మృతి చెందాడు. రెండు రోజులుగా క్యూలో నిల్చుండటంతో ఎండ దెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య, ఆ నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.