JMS News Today

For Complete News

మహిళా ప్రాణాలను కాపాడారు….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 5: పోలీసులు, స్థానికుల చాకచక్యంతో ఒక మహిళ ప్రాణం దక్కింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తిమ్మాపూర్ మండలం అల్గునూరు శివారులోని కాకతీయ కాలువలో బుధవారం ఉదయం కరీంనగర్ పట్టణానికి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకోవాలనే ఉదేశ్యంతో కాకతీయ కెనాల్ లో దూకగా, నీటి ప్రవాహానికి కొట్టుకొని పోతున్న ఆ మహిళను అటుగా వెళ్తున్న స్థానికులు సుందరగిరి సతీష్, దుండ్ర. ఎల్లయ్యలు ఆ మహిళను నీటినుండి బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే స్పందించిన ఎల్ఎండి ఎస్ఐ కృష్ణారెడ్డి, బ్లుకోల్ట్స్ హోంగార్డ్ లక్ష్మీనారాయణలు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను పోలీస్ వాహనంలో స్వయంగా ఎస్ఐ కృష్ణారెడ్డి వాహనం నడుపుకుంటూ వెళ్లి కరీంనగర్ లో గల ఓ ఆసుపత్రి లో చేర్పించారు. ఎలాగైనా యువతి ప్రాణాలు కాపాడాలని ఆలోచనతో సొంతంగా వాహనాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన ఎస్ఐని ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు. ఆ మహిళను కాపాడిన స్థానికులైన సుందరగిరి సతీష్, దుండ్ర ఎల్లయ్య లను ఎస్ఐ కృష్ణారెడ్డి, ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆత్మహత్యలు అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మిగిలిన కుటుంబ సభ్యుల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని, ఏమైన సమస్యలు ఉంటె కుటుంబ సభ్యులు, పెద్దలు సమక్షంలోనో లేక కౌన్సిలింగ్ తో పరిష్కరించుకోవాలని, ఎవరుకూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఎస్ఐ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *