బిట్ కాయిన్ పేరుతో చీటింగ్
1 min read
బ్రేకింగ్ న్యూస్..
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 27: బిట్ కాయిన్ పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ఆశిష్ మాలిక్ అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బిట్ కాయిన్ పేరుతో తనను మోసం చేశారని హైదరాబాద్ చెందిన రామకృష్ణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను గుర్తించారు. వారిలో మార్కెటింగ్ డైరెక్టర్ ను ఢిల్లీలో అరెస్టు చేసి పిటి వారంట్‌పై సీసీఎస్ పోలీసులు తీసుకువచ్చారు. విచారణలో దేశవ్యాప్తంగా బిట్ కాయిన్ పేరుతో రూ. 59 కోట్లు చీటింగ్ కు పాల్పడ్డినటు గుర్తించారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిసింది.