కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికుల ధర్నా
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 8: గ్రామ పంచాయితీ కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనం రూ. 8500లకు సంబంధించిన జివొ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో పంచాయితీ కార్మికులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కు ఆరు డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు కలెక్టరేట్ వరకు ర్యాలీ గా వచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు కార్యదర్శి శేఖర్ తోపాటు పలువురు నాయకులు, పెద్ద ఎత్తున జిపి కార్మికులు పాల్గొన్నారు.