JMS News Today

For Complete News

పేరెంట్స్ రాస్తారోకో…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

మెట్ పల్లి, జూలై 24: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపురం గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు కోరుట్ల-మెట్ పల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో తో ఆ రహదారిపై రాకపోకలు కొద్ది సేపు నిలిచిపోయాయి. ఆ తరువాత పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *