ప్రభుత్వ ఆశయ సాధనకు కృషి చేయాలి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
పెద్దపల్లి , ఫిబ్రవరి 3: ప్రభుత్వ ఆశయ సాధన దిశగా అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని జిల్లా నూతన కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా జీహెచ్ఎంసి అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న సిక్తా పట్నాయక్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా బదిిలీ కాగా, సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వికరించిన కలెక్టర్ ను జాయింట్ కలెక్టర్, ఇంచార్జి డిఆర్వో , కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉందని, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ మన జిల్లాకు ఉన్న మంచి పేరు మరింత పెంచే విధంగా పనిచేయాలని, దానికి అందరి సహకారం కావాలని కోరారు. రాష్ట్ర వ్యాపితంగా పారిశుద్ద్యం పకడ్భందిగా నిర్వహిస్తు పచ్చదనం పెంపొందించడానికి ప్రభుత్వం నూతనంగా గ్రామ పంచాయతి చట్టం, మున్సిపల్ చట్టాలను తీసుకొని వచ్చిందని, ప్రణాళికాబద్దమైన అబివృద్ది సాధనకు అవి ఎంతగానో ఉపయోగపడుతాయని, వాటిని మన జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు అందే విధంగా కృషి చేయాలని, అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ గ్రామాలలో, పట్టణాలో ప్రాధాన్యత క్రమం ప్రకారం అభివృద్ది పనులు వేగంగా పూర్తి చేసే దిశగా మనం కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లా వ్యాపితంగా అక్షరాస్యత పెంపొందించే కార్యక్రమంలో సైతం మనమంతా ఉత్సాహంగా పాల్గోనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.