వారిది తప్పుడు ప్రచారం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 22: పేదలు ఆత్మగౌరవంతో బతుకాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పెంచిన ఆసరా పింఛన్లు లబ్ధిదారుల్లో ఆనందాన్ని రెట్టింపు చేశాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం నగరంలోని ఎన్ఎన్ గార్డెన్ లో పెంచిన పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కళ్ళ ల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. మారిన కాలానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ పింఛన్లను పెంచినట్టు తెలిపారు. పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలని కోరారు. పింఛన్ల పంపిణీ విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. పింఛన్ల పంపిణీలో 90 శాతం వాటా రాష్టానిదే అన్నారు. ఆసరా పింఛన్ల పంపిణీ విషయంలో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలకు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, మాజీ డిప్యూటి మేయర్ అబ్బాస్ షమీ, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, పలువురు నాయకుకులు, అధికారులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు..