JMS News Today

For Complete News

బడ్జెట్ ఎఫెక్టు…పెట్రో బాదుడు షురూ..

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూలై 5 : మళ్ళీ పెట్రో బాదుడు మొదలైంది. కేంద్ర బడ్జెట్‌ ఎఫెక్ట్ ఇంధన ధరలపై పడింది. లీటర్ పై రూపాయి సుంకం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. పెట్రోల్ పై లీటర్ రూ.2.50పైసలు పెరగగా, డీజిల్ లీటర్ ధర రూ.2.3గా పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర బడ్జెట్ 2019-20లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇంధనంపై లీటర్ కు రూపాయి ట్యాక్స్ పెంచుతున్నట్టు ప్రకటించారు. బడ్జెట్ లో  ప్రకటించారో లేదో చమురు సంస్థలు ధరలు పెంచేసాయి. ఇక వాహనదారులకు అదనపు భారం పడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *