మొదట కేసులు..ఇప్పుడు సేఫ్ జోన్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఏప్రిల్ 12: తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసులు కరీంనగర్ లో వచ్చినా, మిగితా జిల్లాలతో పోలిస్తే ప్రస్తుతం కరీంనగర్ సేఫ్ జోన్ లో ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కరీంనగర్ లో కట్టడి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ముందస్తు చర్యలు జాగ్రత్తలు చేపట్టిన మంత్రి గంగుల కమలాకర్ తో సహా కలెక్టర్ శశాంక, మేయర్ సునిల్ రావు, కమీషనర్ క్రాంతిలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ చాంబర్ లో ఆదివారం వినోద్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, మేయర్ సునిల్ రావు, కమీషనర్ క్రాంతిలతో కలిసి సమావేశమయ్యారు. మంత్రి గంగుల కమలాకర్, బి. వినోద్ కుమార్ లు కరోనా వైరస్ పై నగరపాలక సంస్థ చేస్తున్న పారిశుధ్య పనులు, ప్రాణాలకు తెగించి కార్మీకులు అందిస్తున్న సేవలు, జిల్లా యంత్రాంగ తీసుకుంటున్న జాగ్రత్తలపై చర్చించారు. అలాగే ఇకముందు తీస్కోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, పాటించాల్సిన పద్దతులు, ప్రజలకు కల్పించే సౌకర్యాలు, వసతులపై కమలాకర్, వినోద్ కుమార్ లు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సంధర్బంగా ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ
కేబినేట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మంత్రి గంగుల, కలెక్టర్ శశాంక, మేయర్ సునిల్ రావు, కమీషనర్ క్రాంతి తో పాటు జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారని తెలిపారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కరోనా వైరస్ ను జిల్లాలో పూర్తిగా తరిమికొట్టేందుకు ఇంకా పకడ్బంది చర్యలు చేపట్టాలని, ప్రజలను అవగాహన పరిచి… సామాజిక దూరం పాటించేలా చర్యలు తీస్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, గ్రంథాలయ చైర్మన్ రవింధర్ రెడ్డి కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.