రక్త కణాలు దానం చేసిన ఉప సర్పంచ్
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, సెప్టెంబర్ 27: ఉప సర్పంచ్ కు రక్త కణాలు దానం చేసి శభాష్ అనిపించుకున్న మరో ఉప సర్పంచ్. వివరాల్లోకి వెళితే…
రామడుగు మండలం వెదిర గ్రామ ఉప సర్పంచ్ ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి జ్వరంతో కరీంనగర్లోని అపెక్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగా, వైద్యులు రక్త కణాలు 20వేలకు పడిపోయాయని చెప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రక్త కణాల దాతల కోసం సంప్రదించగా, గుండి గ్రామానికి చెందిన గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ రక్త కణాలను దానం చేశారు. రక్త కణాలు దానం చేసిన ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ను వెదిర గ్రామస్తులు, గుండి గ్రామస్తులు, మండల ఉపసర్పంచ్ లు అభినందించారు.