పీఎంపీ, ఆర్ఎంపీ సంఘం నేతగా కోల్ల
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, జూలై 28: రామడుగు మండల పీఎంపీ, ఆర్ఎంపీ ఆసోసియేషన్ అధ్యక్షులుగా కోల్ల సంజీవరెడ్డి (వెలిచాల), ప్రధాన కార్యదర్శిగా బాబ్ జీ (రామడుగు), గౌరవ అధ్యక్షులుగా సత్యనారాయణ (గోపాల్ రావుపేట) లు ఎన్నికయ్యారు. సంఘం జిల్లా అధ్యక్షులు దొంతుల మనోహర్, ఎన్నికల ఆధికారి కటుకం రవీందర్ ఆద్వర్యంలో మండలంలోని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రామడుగు మండల పీఎంపీ, ఆర్ఎంపీలు పాల్గొన్నారు.
ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గాన్ని డా,, సాయిని నరేందర్ పుష్పగుచ్చం ఇచ్చి ఆభినందించారు.