కరీంనగర్ లో తనిఖీలు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 13: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి కరీంనగర్ నగరంలో ఉన్న లాడ్జీలు, బస్టాండ్, రద్దీ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను విచారించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకల సందర్భంగా కరీంనగర్ లో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అనుమానిత, అపరిచిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్, లాడ్జెస్, రద్దీ ప్రదేశాలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టడం జరిగిందని వివరించారు.