వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 17: వ్యభిచార గృహలపై టాస్క్ ఫోర్స్, టూ టౌన్ పోలిసులు సంయుక్తంగా ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. కరీంనగర్ లోని విద్యానగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నడిపిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిర్వాహకులను, యువతిని, విటులను అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల కు చెందిన బీమాంటి నరేశ్, మంకమ్మతోటకు చెందిన కూకట్ల సంజీవ్ తోపాటు, సిరిసిల్ల కు చెందిన ఆర్గనైజర్ గారిపెల్లి హరీష్ లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిపై టూ టౌన్ పోలిసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బాధితురాలిని సదరన్ హోమ్ కి పంపించారు. ఈ సందర్భంగా సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ లో వ్యభిచారం నడుస్తున్న అన్ని ఇండ్లపై టాస్క్ ఫోర్స్ నిఘా ఉందని, ఇప్పటికైనా నిర్వాహకులు తమ అక్రమ కార్యకలాపాలను ఆపాలని, నిర్వాహకులపైన పీడీ యాక్టు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ దాడుల్లో సీఐలు ప్రకాష్, శశిధర్ రెడ్డి , దేవా రెడ్డి, ఎస్ఐలు నరేష్ , వంశీ తదితరులు పాల్గోన్నారు.