పెద్దల క్లబ్ పై ఆకస్మిక దాడి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూన్ 30: జగిత్యాల అఫీషియల్ క్లబ్ పై పట్టణ పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి టోకెన్స్ స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా ఈ క్లబ్ లో పెద్దఎత్తున పేకాట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దాడులు కొనసాగిన సమయంలో స్వాధీనం చేసుకున్న టోకెన్ లతో పేకాట వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. పేకాట ఆడుతున్న వారి నుండి పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన వారిలో పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, న్యాయ వాదులు, వ్యాపార వేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జగిత్యాల టౌన్ సిఐ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో పలువురు ఎస్ఐలు, పోలీసులచే విచారణ కొనసాగుతోంది. కాగా, క్లబ్ పై దాడి జగిత్యాల జిల్లా లో చర్చనీయాంశంగా మారింది.