JMS News Today

For Complete News

ఇక పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూలై 2:  ఇప్పటివరకు పోలీసులు ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం చూశాం,  కానీ ఇప్పుడు పోలీసులకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నారు. ఈ మేరకు రాచకొండ కమిషనరేట్ పోలీసు బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై విధులకు హాజరయ్యే పోలీసులకు రోజుకు రెండుసార్లు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు  నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం డ్యూటీకి రాగానే ఓమారు, ఆపై డ్యూటీ నుంచి వెళ్లిపోయే ముందు మరోమారు వారేమైనా మద్యం తాగారా? అన్న విషయాన్ని పరీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులే రాచకొండ లా అండ్ ఆర్డర్ విభాగం పోలీసులను పరీక్షిస్తారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో కొందరు పోలీసులు మందు కొట్టి ఉన్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *