రాజధానిలో…ఏం జరిగిందంటే….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 29: హైదరాబాద్ లో రౌడీమూకలు హల్ చల్ చేశాయి. ఇద్దరు రౌడీలను అదుపులోకి తీసుకున్నారన్న అనుమానంతో ఏకంగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకున్న పోలీసులను దుర్బాషలాడారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొనగా, హబిబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు భారీగా మోహరించారు. ఏలాంటి ఘటన జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.