రోకలి బండ ఎక్కించింది వాస్తవం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 26: పోలీసులు రోకలి బండలు ఎక్కించింది వాస్తవమని భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భజరంగ్ దళ్ నాయకులు మాట్లాడుతూ, విశ్వ హిందూ, భజరంగ్ దళ్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని, రోకలి బండ ఎక్కించి భయభ్రాంతులకు గురి చేసారని ఆరోపించారు. కమ్యూనల్ కేసు పెడతానని సీపీ బెదిరించారని, కుటుంబ సభ్యుల ఫై కేసు లు పెడతానని భయపెట్టారని తెలిపారు. అసలు ఫిర్యాదుదారు ఎవరో కూడా మాకు తెలియదని, సమావేశం ఉందని రూరల్ స్టేషన్ కు పిలిచి అక్రమ కేసు లు పెట్టారని వాపోయారు. ఈ విషయాన్ని కోర్టు లో చెబితే మీ కుటుంబ సభ్యులకు హానీ కలగజేస్తామని బెదిరించారని ఆరోపించారు. బెయిల్ పై బయటికి వచ్చిన తర్వాత డీజీపీ కీ ఫిర్యాదు చేశామని తెలిపారు. అనంతరం సీపీ చట్ట ప్రకారం తీసుకున్నామంటూ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారని, సీపీ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ, అధికార పార్టీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటన పై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులుశ్రావణ్ కుమార్, రాజేందర్, కాశీనాథం లతో పాటు పలువురు పాల్గొన్నారు.