JMS News Today

For Complete News

ఇక విజేతలేవరో…అందులో నిక్షిప్తం…!?

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, డిసెంబర్ 10: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ
ఎక్కడ కూడా ఏలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ తో పాటు వివిధ నియోజక వర్గాల్లో ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నానికి ఊపందుకుంది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హైదరాబాద్ క్యాంప్ ల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాల సమీపం వరకు బస్సుల్లో వచ్చి ఓట్లు వేశారు. జిల్లాకు చెందిన మంత్రులు కేటీఆర్ సిరిసిల్లలో, గంగుల కమలాకర్ కరీంనగర్ లో, కొప్పుల ఈశ్వర్ జగిత్యాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో ఓట్లు వేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1324 ఓటర్లు ఉండగా, 1320 మంది ఓటు వేశారు. సాయంత్రం 4 గంటల వరకు 99.70 శాతంగా పోలింగ్ నమోదైంది. మిగిలిన నలుగురు ప్రజాప్రతినిధుల్లో
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఓటు హక్కును వినియోగించుకోకపోగా, సిరిసిల్లలో అనారోగ్యంతో ఓ ఎంపిటిసీ ఓటు వేయలేదు. మరోకరు చనిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్.రమణ, భాను ప్రసాద్ రావ్ ఇద్దరూ ఆయా కేంద్రాలు తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలించారు. మంత్రి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి వచ్చి కరీంనగర్ జడ్పీ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించారు.
ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ కు మద్దతు ఇచ్చిన ఈటెల రాజేందర్ అసలు ఏ పార్టీ అని ప్రశ్నించిన మంత్రి గంగుల ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ ఎక్కువ సార్లు పోలింగ్ కేంద్రానికి వస్తుండటాన్ని మంత్రి తప్పుబట్టారు. బయటకు పంపించాలని పోలీసుల దృష్టికి తెచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ కూడా అధికార పార్టీ తీరును తప్పుబట్టారు. కాగా, కరీంనగర్ లో రెండు ఎమ్మెల్ఫీ స్థానాలు అవలీలగా తామే కైవసం చేసుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు ఏజపక్షమే అని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1324 ఓట్లు ఉంటే అందులో దాదాపు వెయ్యి ఓట్లు టీఆర్ఎస్ వారివే ఉన్నాయి. బిజెపి, కాంగ్రెస్ లు అసలు అభ్యర్థులనే బరిలో నిలపలేదు. మొత్తానికి పోటీలో ఉన్న 10 మందిలో ఎనిమిది మంది ఇండిపెండెంట్ లే కావడంతో కరీంనగర్ లోని రెండు స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడానికి ఎన్నికల అధికారు(జిల్లా కలెక్టర్, సీపీ)లు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published.