అట్టహాసంగా టిఆర్ఎస్ శంకుస్థాపనలు…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 24: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు సోమవారం అట్టహాసం గా శంకుస్థాపన (భూమి పూజ) కార్యక్రమాలు జరిగాయి. ఏ జిల్లాలో ఎవరూ భూమి పూజ చేయాలనేది పార్టీ నిర్ణయించిన మేరకు తొమ్మిది జిల్లాలలో మంత్రులు, మిగతా జిల్లాలలో జడ్పీ చైర్మన లు శంకుస్థాపన లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు సంబంధించి కరీంనగర్ లో మంత్రి ఈటెల రాజేందర్, జగిత్యాలలో మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, సిరిసిల్ల లో జడ్పీ చైర్ పర్సన్ అరుణ, పెద్దపల్లి లో జడ్పీ చైర్మన్ పుట్ట మధు లు శంకుస్థాపన లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు రవిశంకర్, బాలక్రిష్ణ, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, మేయర్ రవీందర్ సింగ్, ఈద శంకర్ రెడ్డిలతోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.