అక్కడ ఉచితంగా అంత్యక్రియలు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామగుండం, జూలై 30: కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ “ఆఖరి సఫర్” పేరిట పేదలకు రూపాయికే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండగా, రామగుండం కార్పోరేషన్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే సొంత ఖర్చులతో ఉచితంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ముందుకువచ్చారు. ఎవరైనా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు మరణిస్తే అంతిమ సంస్కారాల ఖర్చు భారం వారి మీద పడకుండా ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని పేదలకు ఉచితంగా అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చందర్ తెలిపారు. అంతిమ సంస్కారాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషనే చేస్తుందని అన్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ ఒకటి నుండి ఈ సేవలు అమలు చేస్తామని ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రకటించారు.