నిరుపేద క్రీడాకారులకు చేయూత…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మే 3: నిరుపేద పూర్వ క్రీడాకారులకు పలువురు ఆపన్న హస్తం అందించారు. శంకరపట్నం మండలం మొలుంగూరు గ్రామానికి చెందిన పూర్వపు క్రీడాకారులైన ఎండి.షాహిద్ అలీ, కూర సతీష్, గాజుల కుమార్ కి తోటి క్రీడాకారులు ఆదివారం సహాయం అందించారు. పూర్వపు క్రీడాకారులు ఆలీ, సతీష్, కుమార్ ఆటోలు నడుపుకొని జీవనోపాధి పొందుతున్నారు. అయితే, లాక్ డౌన్ ఉండట వల్ల ఇంటికి పరిమితమై కుటుంబ పోషణ భారమైన నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న తోటి పూర్వపు క్రీడాకారులు వారికి సహాయం అందించారు. ఒక్కో కుటుంబానికి సుమారు 75 కిలోల బియ్యంతో పాటు, నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు క్రీడాకారులు కన్నం మహేష్, ఎండి ఫారూఖ్, పెద్ద ప్యాట రాజు, కల్లూరి భాస్కర్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.