JMS News Today

For Complete News

ప్రతి ఇంటా ఖాతా ఉండేలా….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 22: పోస్టల్ శాఖలో అందుబాటులో ఉన్న పథకాలు, ఖాతాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ డివిజన్ పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎ.సునీల్ పిలుపునిచ్చారు. పోస్టల్ పథకాలు, ఖాతాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కరీంనగర్ డివిజన్ పోస్టల్ శాఖ చేపట్టిన మేళాలో భాగంగా శుక్రవారం రామడుగు, గంగాధర మండల కేంద్రాల్లో పథకాలు, ఖాతాలపై ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా పోస్టల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి సుకన్య సమృద్ధి యోజన పథకం, రికరింగ్ డిపాజిట్ పథకం, సేవింగ్ పథకం, ఐపిపిబి, ఆర్పీఎల్ఐ, పిఎల్ఐ తదితర పథకాలు, ఖాతాలపై కూలకషంగా వివరించారు. ఈ సందర్బంగా ఎఎస్పీ సునీల్ మాట్లాడుతూ పోస్టల్ శాఖలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే పలు పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఇంటా పోస్టల్ సేవలు ఉండాలనే క్రమంలోనే ఈ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఇంటింటా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. పోస్టల్ శాఖలో అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, ఖాతాలను సద్వినియోగం చేసుకోవాలని సునీల్ కోరారు. ఈ కార్యక్రమంలో ఐపిఓ చంద్రమోహన్, రామడుగు, గంగాధర ఎస్పీఎంలు అజ్మత్ అలీ, ప్రవీణ్ కుమార్, మెయిల్ ఓవర్ సీర్ మల్లేశం, పలువురు బీపీఎంలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.