JMS News Today

For Complete News

సామాజిక సేవలో మేము సైతం…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

వేములవాడ, జూలై 27: నిత్యం ఉత్తరాలు, వాటి బట్వాడాతోపాటు చిన్న మొత్తాల పొదుపు పథకాలతో కుస్తీ పడే పోస్టల్ సిబ్బంది సామాజిక సేవలో సైతం భాగస్వాములు అవుతున్నారు. పోస్టల్ శాఖతో అనుబంధమున్న ఆసరా పెన్షన్ దారులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. ఈ అరుదైన సేవను వేములవాడ మండలం సంకేపల్లి గ్రామ పోస్టాఫీసు దక్కించుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన వర్ష కంటి ఆసుపత్రి సహకారంతో సంకేపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన కంటి వైద్య శిబిరాన్ని కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వై. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోస్టల్ ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోస్టల్ శాఖ అందించే సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సత్ససంకల్పంతో కరీంనగర్ డివిజన్ వ్యాప్తంగా మేళాలు నిర్వహిస్తూ..గడప గడపకు వెళ్ళి తమ సేవలను వివరిస్తున్నామని తెలిపారు. ఇందులో బాగంగానే సంకేపల్లి గ్రామ పోస్టాఫీసు ఆధ్వర్యంలో పోస్టల్ శాఖలో పత్తి నెల పెన్షన్ తీసుకునే పెన్షన్ దారులకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ వైద్య శిబిరానికి పూనుకున్న వేములవాడ ఎస్పీఎం తిరుపతి, సంకేపల్లి గ్రామ బ్రాంచ్ పోస్టు మాస్టర్ అరుణ, కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్య సిబ్బందికీ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంకేపల్లి గ్రామంలో పోస్టల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పోస్టల్ శాఖలో అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పాటు ఇతరల పథకాలపై కూలంకషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఐపిఓ చంద్రమోహన్, వేములవాడ ఎస్పీఎం తిరుపతి, మెయిల్ ఓవర్ సీర్లు భూమిరెడ్డి, ఆంజనేయులు, పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.